Breaking News

మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

త్వరితగతిన నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలి – అధికారులకు ఎస్పీ ఆదేశాలు

సంగారెడ్డి, జూన్ 12: సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు.

సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దర్యాప్తులో సందేహాలు ఎదురైతే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారికి భరోసా కల్పించాలని, ప్రతి గ్రామానికి విలేజ్ పోలీస్ అధికారిని నియమించి రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు.

మహిళల భద్రతతో పాటు రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లు చేపట్టి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా, బ్లూ కోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది “పాపిలాన్ డివైస్”ల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్‌ప్రింట్లు సేకరించాలని సూచించారు. నేరాల నివారణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, ప్రతి గ్రామంలోని ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ బంకులు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అవగాహన కల్పించాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు.

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్‌

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ కాష్ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. పోలీస్ స్టేషన్లలో ప్రతిభ కనబరిచే సిబ్బందిని గుర్తించి ప్రశంసాపత్రాలకు సిఫారసు చేయాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు.

సమావేశం అనంతరం పోలీస్ వాహనాల స్థితిని పరిశీలించిన ఎస్పీ, వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ నిర్వహించి అత్యవసర కిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని డ్రైవర్లకు సూచించారు. వాహనాలను పరిశుభ్రంగా నిర్వహించిన డ్రైవర్లకు ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, జిల్లా ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *