బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
SANGA REDDY DIST

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్‌పీడీసీఎల్ అదనపు సహాయ ఇంజనీర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్‌పీడీసీఎల్ అదనపు సహాయ ఇంజనీర్

సంగారెడ్డి, జూన్ 18: సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) అదనపు సహాయ ఇంజనీర్ (ఆపరేషన్స్) బి. రామకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూన్ 18న మధ్యాహ్నం 1:25 గంటల సమయంలో బొల్లారం ఐడీఏలోని తన కార్యాలయం సమీపంలో ఫిర్యాదుదారుని నుంచి రూ.25,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడు జూన్ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కారుతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి దెబ్బతీయగా, ఆ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు నిందిత అధికారి లంచం కోరినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో నిందితుడి వద్ద నుంచి రూ.25,000 లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సేవకుడిగా తన విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ లాభం పొందేందుకు వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

అనంతరం నిందిత అధికారిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.

అవినీతి డిమాండ్లు ఎదురైనప్పుడు ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.