బ్రేకింగ్ న్యూస్
శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS
Uncategorized

లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – నలుగురు అరెస్ట్

లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – నలుగురు అరెస్ట్

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. Hyderabad City Police కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సికింద్రాబాద్ జోన్) బృందం మరియు Lalaguda పోలీసులు సంయుక్తంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు Lalapet ప్రాంతంలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ‘ఝాన్సీ’ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై Lalaguda Police Station లో Cr.No 84/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు నీల వెంకటేశ్వర్లు తన గోడౌన్‌లో సూపర్‌వైజర్ వినోద్ మరియు ఇతర వర్కర్ల సహాయంతో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నాడు. ఈ పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా చేసి, తర్వాత ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసి నకిలీ బ్రాండ్ లేబుల్స్, డేట్ స్టాంపులు వేసి వివిధ కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో గోడౌన్ నుంచి సుమారు 1915 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్, 30 కేజీల ఎసిటిక్ యాసిడ్, 10 కేజీల క్సాంతమ్ గమ్, గ్రైండర్ మరియు ప్యాకింగ్ మెషీన్లు, ముడి అల్లం-వెల్లుల్లి వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

ఈ దాడిని సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్, లాలాగూడ ఇన్‌స్పెక్టర్ టి. అశోక్ కుమార్, ఎస్‌.ఐలు ఎస్‌. రాజు, రాజేశ్వర్ రెడ్డి మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ Ande Srinivasa Rao తెలిపారు.