Breaking News

డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

55 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.. 24 వాహనాలపై చర్యలు

నిజామాబాద్, జూన్ 4: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై, నంబర్ ప్లేట్లు తొలగించి లేదా మార్ఫింగ్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా రాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో 55 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, నంబర్ ప్లేట్లు తొలగించిన లేదా స్పష్టంగా కనిపించకుండా మార్పులు చేసిన 24 వాహనాలను గుర్తించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు తప్పవు

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు తొలగించడం, నంబర్లను మార్ఫింగ్ చేయడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.

నంబర్ ప్లేట్లు స్పష్టంగా ఉండాలి

ప్రతి వాహనదారుడు తన వాహనానికి నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి, అది స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలని సూచించారు. సరైన నంబర్ ప్లేట్లు ఉండడం వల్ల దొంగిలించబడిన వాహనాలను గుర్తించడం, నేరస్థులను పట్టుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

నంబర్ ప్లేట్ లేకపోయినా.. కప్పిపుచ్చినా చర్యలు

వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నడపడం, నంబర్ కనిపించకుండా వస్తువులు అడ్డుపెట్టడం, కొంత భాగాన్ని తొలగించడం లేదా ఉద్దేశపూర్వకంగా మార్పులు చేయడం వంటి చర్యలపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

రోడ్డు భద్రత కోసం ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *