Breaking News

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – నలుగురు వ్యక్తుల అరెస్ట్.

హైదరాబాద్ సిటీ, కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సికింద్రాబాద్ జోన్) బృందం మరియు లాలాగూడ పోలీసులు సంయుక్తంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, లాలాపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ‘ఝాన్సీ’ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌పై దాడి చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 1.నీల వెంకటేశ్వర్లు, 2.కె. వినోద్, 3.టి. సతీష్, 4.ఎం. శివాని.
మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్: 1915 కేజీలు (వివిధ పరిమాణాల బాక్సులలో మరియు 18 ప్లాస్టిక్ టబ్బులలో).
• ఎసిటిక్ యాసిడ్: 30 కేజీలు.
• క్సాంతమ్ గమ్: సుమారు 10 కేజీలు.
• యంత్రాలు: గ్రైండర్/మిక్సింగ్ మెషిన్ (1), వెయింగ్ మెషిన్ (1), ప్యాకింగ్ మెషీన్లు (2).
• ఇతరాలు: ముడి అల్లం మరియు వెల్లుల్లి (80 కేజీలు), డేట్ స్టాంపులు (4), ఝాన్సీ-M పేరుతో ఉన్న లేబుల్స్ (86).
ప్రధాన నిందితుడు నీల వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ వినోద్ మరియు ఇతర వర్కర్ల సహాయంతో లాలాపేటలో ఈ గోడౌన్‌ను నిర్వహిస్తున్నాడు. వీరు అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తున్నారు. అనంతరం వీటిని ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసి, నకిలీ బ్రాండ్ లేబుల్స్ మరియు స్టాంపులు వేసి వివిధ కిరాణా షాపులకు, వినియోగదారులకు సరఫరా చేస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నారు.
ఈ దాడిని సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్, లాలాగూడ ఇన్‌స్పెక్టర్ టి. అశోక్ కుమార్, ఎస్.ఐ ఎస్. రాజు, ఎస్.ఐ రాజేశ్వర్ రెడ్డి మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – మహిళా పోలీసులకు సన్మానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *