బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Uncategorized

అత్తాపూర్‌లో 13 మంది రౌడీ షీటర్ల బైండోవర్

అత్తాపూర్‌లో 13 మంది రౌడీ షీటర్ల బైండోవర్

శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపట్టిన రాజేంద్రనగర్ పోలీసులు

హైదరాబాద్, జూన్ 4: రాజేంద్రనగర్ జోన్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను నియంత్రించడం లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 13 మంది రౌడీ షీటర్లను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఎదుట హాజరుపరచి బైండోవర్ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని హెచ్చరిస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి

రాజేంద్రనగర్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు, రౌడీ మూకలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రజలకు భద్రత కల్పించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.