బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

మహబూబాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకులపై పోలీసుల ప్రత్యేక దాడులు.. 10 కేసులు నమోదు

మహబూబాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకులపై పోలీసుల ప్రత్యేక దాడులు.. 10 కేసులు నమోదు

మహబూబాబాద్: జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై మహబూబాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి పలు కేసులు నమోదు చేశారు.

సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మొత్తం 90 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ రుణగ్రహీతల నుంచి షూరిటీ పేరుతో ఖాళీ చెక్కులు, భూముల అసలు పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, అలాగే ఎలాంటి లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించారు.

పోలీసులు మొత్తం 10 మంది నిందితులపై 10 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా వారి వద్ద నుంచి సుమారు రూ.3.59 కోట్ల విలువైన 266 డాక్యుమెంట్లను స్వాధీనం (సీజ్) చేసుకున్నారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

అక్రమ వడ్డీ వ్యాపారం, అనుమతి లేకుండా చిట్టీల నిర్వహణ, ప్రజలను బెదిరించి ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలు తీసుకోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు హెచ్చరించారు.

ప్రజలు ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.