బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థుల పాత్ర కీలకం: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థుల పాత్ర కీలకం: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్ల: డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.

మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచర్ల జూనియర్ కళాశాలలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని సూచించారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్‌ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడడంతో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ఇతరుల్లోనూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని కోరారు.

చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే విద్యార్థులు తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగలరని డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఎస్‌ఐ రాహుల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.