Breaking News

సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు.. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలకు నో

సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జూన్ 1 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

సంగారెడ్డి ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం

పోలీసుల అనుమతి లేకుండా పై కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *