బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
SANGA REDDY DIST

బక్రీద్ నేపథ్యంలో అర్ధరాత్రి చెక్‌పోస్టుల ఆకస్మిక తనిఖీ.. అక్రమ రవాణాపై కఠిన చర్యలు : సంగారెడ్డి ఎస్పీ

బక్రీద్ నేపథ్యంలో అర్ధరాత్రి చెక్‌పోస్టుల ఆకస్మిక తనిఖీ.. అక్రమ రవాణాపై కఠిన చర్యలు : సంగారెడ్డి ఎస్పీ

బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పుల్కల్, ఎంఎన్‌ఆర్, కవలంపేట్, ఇంద్రకరణ్, కొండాపూర్, మునిపల్లి చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.

వాహనాల తనిఖీల సమయంలో పోలీసులు తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని, లైట్ బ్యాటన్‌లను వినియోగించాలని సూచించారు. అలాగే బీట్, పెట్రోలింగ్ విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు కీలక సూచనలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో అసత్య సందేశాలు ఫార్వర్డ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.