బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

వికారాబాద్ జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు పోటీలు విజయవంతం.. శాస్త్రీయ దర్యాప్తుపై ఎస్పీ స్నేహ మెహ్రా దృష్టి

వికారాబాద్ జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు పోటీలు విజయవంతం.. శాస్త్రీయ దర్యాప్తుపై ఎస్పీ స్నేహ మెహ్రా దృష్టి

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎస్పీ పోటీలను పరిశీలించి పాల్గొన్న అధికారులను ప్రోత్సహించారు.

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు ఉత్సాహంగా పాల్గొని తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు. శాస్త్రీయ దర్యాప్తు (Scientific Aids to Investigation) విభాగంలో భాగంగా పలు రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలను నిర్వహించారు.

పోటీల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ లా (రాత పరీక్ష), లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ (ప్రాక్టికల్), ఫింగర్ ప్రింట్స్ సైన్స్ (ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు), క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ (ప్రాక్టికల్) వంటి విభాగాల్లో అధికారులు తమ ప్రతిభను చాటారు. సంఘటనా స్థలాన్ని శాస్త్రీయంగా పరిశీలించడం, ఆధారాలను సేకరించడం, సంరక్షించడం, క్రైమ్ సీన్‌ను ఖచ్చితంగా ఫోటోలు, వీడియోల రూపంలో నమోదు చేయడం వంటి అంశాల్లో నైపుణ్యాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, పోలీస్ డ్యూటీ మీట్‌లు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులపై పట్టు సాధించడం ద్వారా నేరాల ఛేదన మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికత, క్రైమ్ సీన్ నిర్వహణ, సాక్ష్యాధారాల సంరక్షణలో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

వికారాబాద్ జిల్లా పోలీస్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లలో కూడా ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించిన ఎస్పీ, ఈ పోటీల్లో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.