బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
SANGA REDDY DIST

సంగారెడ్డి జిల్లాలో హనుమాన్ జయంతి శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లాలో హనుమాన్ జయంతి శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, ఏప్రిల్ 02: హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే శోభాయాత్రల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సదాశివపేటలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సదాశివపేట పట్టణంలో జరిగే హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుత వాతావరణంలో శోభాయాత్రలు నిర్వహించేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర నిర్వాహకులు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దాలతో డీజేలు వినియోగించకూడదని సూచించారు. ఇతర మతాల భావాలను దెబ్బతీసేలా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు చేయవద్దని హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

ర్యాలీలో పాల్గొనే వారు శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లను నమ్మవద్దని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా రూమర్లు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.