బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మిక తనిఖీ

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మిక తనిఖీ

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 02: ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.

కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా, పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని స్పష్టం చేశారు.

గ్రామాల్లో నేర నియంత్రణ కోసం విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ సిబ్బందికి సూచించారు. రౌడీ షీటర్లపై కచ్చితమైన నిఘా ఉంచాలని తెలిపారు.

🚨 అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా పదిర వద్ద ఉన్న ఇసుక రీచ్‌ను తనిఖీ చేసి, తవ్వకాల విధానం, రవాణా అనుమతులు, రికార్డులను పరిశీలించారు. అక్రమంగా ఇసుక రవాణా లేదా నిల్వలు ఉంటే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

📹 సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం

నేరాల నియంత్రణకు, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు కీలకమని పేర్కొన్న ఎస్పీ, గ్రామాలు, వ్యాపార ప్రాంతాల్లో విస్తృతంగా వాటి ఏర్పాటు కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో ఎస్పీ వెంట ఎస్‌.ఐ రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.