బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
SANGA REDDY DIST

సంగారెడ్డిలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు

సంగారెడ్డిలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 28, 2026: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన దశ అయినప్పటికీ, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఉద్యోగికి శాశ్వత గౌరవాన్ని తీసుకువస్తాయని జిల్లా ఎస్పీ Paritosh Pankaj పేర్కొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న ధశరత్ (ఎస్‌ఐ), యాదగిరి (ఏఎస్ఐ)లను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

ధశరత్ – నిబద్ధతకు నిదర్శనం

1983లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన ధశరత్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారు. సర్వీస్ మొత్తంలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగారు.
ఇంద్రకర్, మునిపల్లి, వట్‌పల్లి, నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌లలో స్టేషన్ హౌస్ అధికారిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.

యాదగిరి – క్రమశిక్షణకు ప్రతీక

1992లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో సాధారణ విధులతో పాటు క్రైమ్ డ్యూటీలను సమర్థంగా నిర్వహించారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అంచెలంచెలుగా పదోన్నతులు పొంది అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ హోదాకు చేరుకున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

ఇద్దరు అధికారులు పోలీసు శాఖకు అందించిన సేవలు మారువలేనివని ఎస్పీ కొనియాడారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో

రిటైర్మెంట్ అనంతరం వారికి రావలసిన అన్ని రకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో మిగిలిన జీవితం గడపాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కళ్యాణి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ అశోక్, మోహనప్ప, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్ఐలు రాజశేఖర్, డానియెల్ మరియు రిటైర్డ్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.