
నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో మైనర్ బాలికపై అత్యాచారా పాల్పడిన ఘటనలో నిందితుడు గ్యారల శివ శంకర్ @ శివ కుమార్ పై బాధితురాలు పిర్యాదు మేరకు U/s 366 (A), 343,376,420,506 r/w 109 of IPC and Sec.3 r/w 4 of POCSO Act and Sec.9 of Children Marriage Act-2006 Act క్రింద కేసు నమోదు చేసి నిన్న కోర్టుకు హాజరుకాకపోవడంతో శివకుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, 1 టౌన్ పోలీస్ నిందితున్ని పట్టుబడి చేసి కోర్టులో హాజరు పరచగా గౌరవనీయ ADJ-II కమ్ SC/ST కోర్టు,అత్యాచారం మరియు POCSO కేసుల ఫాస్ట్ ర్యాక్ కోర్ట్ నిందితునికి 26 ఏళ్ల జైలు శిక్ష,రూ 40 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,తెలిపారు. ఈ కేసులలో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితులకి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గోపి సిఐ 1 టౌన్ PS,ప్రస్తుతం సీఐ, రాజశేఖర్ రెడ్డి 1 టౌన్ PS నల్గొండ, PPవేముల రంజిత్ కుమార్,CDO వెంకటేశ్వర్లు,1 టౌన్ సిబ్బంది రబ్బానీ, శంకర్, షకీల్, శ్రీకాంత్,సైదులు, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన, లైజన్ అధికారులు, P.నరేందర్, N.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.