
కనగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ సైదులు సతీమణి లక్ష్మీ చేయూత ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కు అందజేసి జిల్లా యస్.పి పరామర్శించి, మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.