బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Hyderabad

నేరరహిత సమాజ స్థాపనకు పోలీసులకు వారధిగా నిలవండి

నేరరహిత సమాజ స్థాపనకు పోలీసులకు వారధిగా నిలవండి

శాంతి సామరస్యాల పరిరక్షణలో పీస్‌ కమిటీలదే కీలకపాత్ర

నేరరహిత సమాజ స్థాపనకు పోలీసులకు వారధిగా నిలవండి

నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ.సజ్జనర్‌ పిలుపు

“హైదరాబాద్‌ నగరం మత సామరస్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడి ‘గంగా-జమునా తెహజీబ్‌’ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నేరరహిత సమాజ స్థాపనలో పీస్‌ కమిటీ సభ్యులు పోలీసులకు, ప్రజలకు మధ్య బలమైన వారధిలా నిలవాలి” అని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం సెంట్రల్‌ పీస్‌, వెల్ఫేర్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సీపీ సజ్జనర్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 1984లో ఏర్పాటైన పీస్ కమిటీలు దశాబ్దాలుగా శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. నేడు హైదరాబాద్ ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటే, అందులో పీస్ కమిటీలతో పాటు నగర పౌరుల కృషి ఎంతో ఉందన్నారు.

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులు

రాబోయే పండుగలను అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పీస్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేలా, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వచ్చే అసత్య ప్రచారాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మకుండా ప్రజలకు వాస్తవాలను వివరించడంలో సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల సామాన్య ప్రజలను చైతన్యపరచడంలో పీస్ కమిటీ సభ్యులు చొరవ చూపాలని కోరారు. అలాగే నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని సమూలంగా అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక బంధాన్ని బలోపేతం చేస్తూ, హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు ఇకపై మూడు నెలలకోసారి జోనల్ స్థాయిలో విధిగా పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన పలు సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా తమకు సలహాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు డి. జోయల్ డేవిస్,ఎస్.ఎం. విజయ్ కుమార్, ఎన్. శ్వేత తో పాటు పలు జోన్ల డీసీపీలు రక్షిత కృష్ణ మూర్తి, ఖరే కిరణ్ ప్రభాకర్, శిల్పవల్లి, ఎ. రమణా రెడ్డి, బి. రాజేష్,జి. చంద్ర మోహన్, ఎస్. శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెడ్గే, కాజల్, అవినాశ్ కుమార్ లు పాల్గొన్నారు.

అలాగే, సెంట్రల్ పీస్ & వెల్ఫేర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీకిషన్ శర్మ, వివిధ జోన్ల అధ్యక్షులు శశికాంత్ అగర్వాల్, ఖాజా అబ్దుల్ మోయిజ్, ఖాజా గాజియుద్దీన్, మహమ్మద్ మౌజం అలీ, తేజో విజయ కుమారి, శశి కాంత్ అగర్వాల్, ఎస్. నారాయణ రెడ్డి, ఆర్. ఉమేందర్ కుమార్, తదితరులు హాజరయ్యారు.