బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణ
Uncategorized

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

హైదరాబాద్, జనవరి 30: నగరంలో మహిళలు మరియు బాలికల రక్షణే పరమావధిగా, వారి పట్ల మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా షీ టీమ్స్ (SHE Teams) సిబ్బందికి ప్రత్యేక ‘రిఫ్రెషర్ కోర్స్’ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, మరియు అడిషనల్ కమిషనర్ (క్రైమ్స్ & ఎస్ఐటీ) ఎం. శ్రీనివాస్, మార్గదర్శకత్వంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మహిళా కోణంలో విధులు నిర్వహించాలి: అడిషనల్ సీపీ

ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, షీ టీమ్స్ సిబ్బంది బాధితులతో మాట్లాడేటప్పుడు సానుభూతితో, మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే, బాధితులకు మానసిక ధైర్యాన్ని, భరోసాను కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలగకుండా చూస్తూ, ప్రజల్లో మహిళా రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి: డీసీపీ లావణ్య

ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య మాట్లాడుతూ, సిబ్బంది యొక్క వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కొత్త చట్టాలు (BNS), సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, బాధితుల పట్ల అనుసరించాల్సిన విధానాలు మరియు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో సిబ్బందికి వివరించారు. ఈ శిక్షణలో సైబర్ నిపుణులు, న్యాయ నిపుణులు మరియు అనుభవజ్ఞులైన రిటైర్డ్ పోలీస్ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు.

ముఖ్యమైన అంశాలు మరియు శిక్షణ:

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

• చట్టపరమైన అవగాహన: భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ప్రత్యేక చట్టాలపై లోతైన అవగాహన.
• సాంకేతికత: సైబర్ నేరాలు, షీ పోర్టల్ నిర్వహణ మరియు సాంకేతిక పరికరాల వాడకం.
• క్షేత్రస్థాయి ఆపరేషన్లు: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం మరియు డెకాయ్ (Decoy) ఆపరేషన్ల నిర్వహణపై శిక్షణ.
• సాఫ్ట్ స్కిల్స్: బాధితులతో సంభాషించే విధానం మరియు ఆత్మరక్షణ మెళకువలు.

షీ టీమ్స్ సూచనలు (SHE Teams Alerts):

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఈ క్రింది సూచనలు జారీ చేసినారు:

• సురక్షిత ప్రయాణం: ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకూడదు. ప్రయాణ వివరాలను సన్నిహితులకు షేర్ చేయాలి.
• నకిలీ ప్రొఫైల్స్: సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి గుర్తింపును నిర్ధారించుకున్నాకే సంభాషించాలి.
• వ్యక్తిగత సమాచారం: వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో అతిగా పంచుకోవద్దు. ఇది గుర్తింపు దొంగతనానికి (Identity Theft) దారి తీయవచ్చు.
• ఖాతాల భద్రత: సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు మరియు ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ పెట్టుకోవాలి.
• మౌనంగా ఉండకండి: వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండటం నేరస్థుడికి బలాన్నిస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి నేరాలను అరికట్టవచ్చు