బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Uncategorized

మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – జిల్లా ఎస్పీ.

నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు,వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్ధి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడి జీవితం వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. డ్రగ్స్ వాడకం వలన యువత యొక్క శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్థిక సమస్యలు,సమాజంలో గౌరవం లేకుండా పోతుందని అన్నారు. సంతోషం కొరకు సేవించడం అలవాటుగా పడి డ్రగ్స్ బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని,డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు,తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు. యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు మరియు ఏ ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలియజేశారు. ఎవరైనా గంజాయి డ్రగ్స్ సేవిస్తే NDPS చట్టం-1985 తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను క్రయవిక్రయాలు,సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ 8712670266 కు సమాచారం తెలపాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియశిలా భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తాను అని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, 2 టౌన్ ఎస్సై సైదులు, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, అధ్యాపకులు మరియు విద్యార్దిని,విద్యార్థులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్