Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు విద్యాసంస్థల లో మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం.

మాధకద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాషా ముక్త్ భారత్ అభియాన్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లాలో విద్యాసంస్థల్లో మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్. “నేను మాధకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఎవ్వరూ డ్రగ్స్ భారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందిస్తానని, డ్రగ్స్ రహిత సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేపించడం జరిగిందన్నారు. జిల్లాలో అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో ఈసంవత్సరం 40 కేసులల్లో 98 మందిని అరెస్ట్ చేసిన 3.700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ,సి.ఐ లు నటేష్,రవి,ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి,ఎస్.ఐ లు శ్రీకాంత్, ప్రేమంనందం, జునైద్, శ్రవణ్, శ్రీనివాస్, రమేష్,పోలీస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *