Breaking News

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో హై అలర్ట్ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

రానున్న 72 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సూచించిందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,సూచించారు. ప్రమాద కారణాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. జలాశయాలు చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. పొంగి పొర్లుతున్న వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. జిల్లా పోలీసు అధికారులు 24*7 అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటలకు చూడటానికి ఎవ్వరూ వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. యస్.హెచ్.ఒ. లు ప్రత్యేకంగా తమ తమ ఏరియాలో ఉన్న చెరువులు కుంటలను సందర్శించి, ప్రమాద అంచున ఉన్న ఆనకట్టల సమాచారం అందించాలని అన్నారు. భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు.

జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు విద్యాసంస్థల లో మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం.
  • లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
    • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
    • ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.
    • రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి.
    • విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు.
    • నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు.
    • వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి
    ప్రయత్నించరాదు.
    • పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *