Breaking News

సైబర్ వారియర్స్ టి-షర్ట్స్ అందజేసిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• సైబర్ నేరాలపై జిల్లా ప్రజలలో అవగాహన కలిపించాలి.
• సైబర్ నేరాల కట్టడిలో సైబర్ వారియర్స్ బాధ్యత కీలకం.
• సైబర్ వారియర్స్ టి-షర్ట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ వారియర్స్ తో నిర్వహించిన, సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, సైబర్ వారియర్స్ కు టి-షర్ట్ లను అందజేశారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్ ల నుండి వచ్చిన సైబర్ వారియర్స్ తో మాట్లాడుతూ.సైబర్ నేరాల కట్టడికి అవగాహన ఒక్కటే మార్గమని, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ నేరాలకు సంభందించి, సైబర్ వారియర్స్ కు వచ్చిన ఫోన్ కాల్స్ కు త్వరితగతిన స్పందించి, బాధితులకు కచ్చితత్వంతో కూడిన సమాచారం అందించాలని అన్నారు. సైబర్ వర్టికల్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లాను ముందు వారుసలో ఉంచడానికి కృషి చేయాలని సైబర్ వారియర్స్ కు సుచించారు. పోలీసు స్టేషన్ల వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డ్ లను అందించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. ఈ సమీక్షలో డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, డి4సి ఇన్స్పెక్టర్ రవి కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్. సైబర్ సెల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు విద్యాసంస్థల లో మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *