
తేది: 03.07.2025 న నకిరేకల్ టౌన్ లోని చీమలగడ్డ కాలని కి చెందిన పరడ సుమలత భర్త మురళి ఉదయం 07:00 గంటల సమయంలో తన ఇంటికి తాళం వేసి కూలీ పనికి పోగా, తన కూతురు ఒక్కతే ఇంటివద్ద ఉంది, సుమారు 11:30 గంటల సమయం లో తన కూతురు ఆడుకోవడానికి ఎదురింటికి పోయి, తిరిగి సుమారు 12:30 గంటల సమయం లో ఇంటికి వచ్చే సరికి వారి ఇంటి రూము, తన అన్నయ్య రూము, మరియు తల్లిదండ్రుల రూము ల తాళాలు పగుల గొట్టి తలుపులు తెరచి వుండి, అట్టి మూడు రూముల్లో బీరువాలలో వున్న బంగారు, వెండి ఆభరణాలు మరియు కొంత నగదు ను గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకొని పోయినారు. ఇట్టి విషయం పై నకరేకల్ పోలీసు స్టేషన్ లోబాధితురాలి పరడ సుమలత పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా SP శరత్ చంద్ర పవార్ ఐపిఎస్, సూచనల మేరకు, నల్గొండ DSP కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో,నకరేకల్ సి.ఐ. పి.రాజశేఖర్ ఆద్వర్యంలో నకరేకల్ ఎస్.ఐ.B.లచ్చి రెడ్డి మరియు వారి సిబ్బంది నాలుగు టీమ్ లుగా ఏర్పడి కేసును చేదించడమైనది. ఇట్టి దొంగతనము కేసు దర్యాప్తులో భాగంగా ఉదయం 10:00 గంటల సమయంలో పైన తెలిపిన నిందితులను చందుపట్ల స్టేజి వద్ద నకిరేకల్-తిప్పర్తి రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా స్కూటీ పై తిప్పర్తి వైపు నుండి నకరేకల్ వైపు వస్తుండగా A-1 వల్లమళ్ళ ప్రదీప్ @ బంటిని పట్టుబడి చేసి విచారించగ, గతములో మైనర్ గా ఉన్నప్పుడు నక్రేకల్, శాలిగౌరారం, కట్టంగూర్, నార్కెట్ పల్లి, నల్లగొండ టౌన్ ప్రాంతాలలో (14) దొంగతనాలు చేసి జువైనల్ హోం మరియు జైల్ కు వెళ్లడం జరిగినది, అతడు నక్రేకల్ దొంగతనం కేసులో (8) నెలలు జైలు శిక్ష అనుబవించి గత డిసెంబర్-2024 లో జైలు నుండి విడుదల అయినాడు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి పరిచయం ఉన్న JCLతో కలిసిచెడు వ్యసనాలకు బానిసై మరియు విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నామని తెలిపినారు. ఆ క్రమంలోనే నకరేకల్, కట్టంగూర్, చిట్యాల, నల్లగొండ టౌన్, నల్లగొండ మండలం దీపకుంట్ల గ్రామం, మరియు నార్కెట్ పల్లి గ్రామాల లో నేరస్తులు అయిన A-1 వల్లమళ్ళ ప్రదీప్ అలియాస్ బంటి మరియు JCL: మైనర్ బాలిక పట్టపగలు తాళాలు వేసిన ఇండ్ల తాళాలు పగుల గొట్టి ఇండ్ల లోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదు మరియు సెల్ ఫోన్ లు ను దొంగిలించుకొని వారు దొంగిలించిన స్కూటీ పై పారిపోయేవారు, వారి ఒప్పుకోలు ప్రకారంగా వారి నుండి 7 లక్షల 84 వేల విలువ గల (5 తులాల 1 గ్రాము బంగారం,119 తులాల వెండి మరియు నగదు రూ.45,000/-, (01) స్కూటీ ,(02) సెల్ ఫోన్లు) మరియు దొంగతనం చేయడానికి ఉపయోగించిన ఒక ఇనుప రాడ్ ను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు.