
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకొని మహిళ పోలీస్ సిబ్బంది,పురుష సిబ్బందితో సమానంగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాధితులకు బరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో, SHE leads-NALGONDA believes అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది అంటే కేవలం పోలీస్ స్టేషన్లో రిసెప్షన్, రికార్డు వర్క్, CCTNS, టెక్ టీమ్ లాంటి విధులకే పరిమితం కాకుండా పోలీసు సంబంధిత అన్ని విధులు క్రైమ్ సంబంధిత, నేర పరిశోధన, కమ్యూనిటీ పోలిసింగ్, బ్లూ క్లోట్స్, నైట్ పెట్రోలింగ్,పిటిషన్ ఎంక్వయిరీ, కోర్ట్ డ్యూటీ, సమాన్స్, మెడికల్ డ్యూటీ, వెహికల్ చెకింగ్, ఎస్కార్ట్ డ్యూటీ, ట్రాఫిక్ డ్యూటీ లు, డయల్ 100, విలేజ్ పోలీస్ ఆఫీసర్,బందోబస్త్ డ్యూటీ ల లాంటివి అన్ని విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవడం జరిగుతుందని అన్నారు. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంచుటకు సెల్ఫ్ డిఫెన్స్ లాంటి శిక్షణలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగంగా మొదటగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో మహిళా పోలీస్ సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహించడం జరుగుతుందనీ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్,అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్.బి సిఐ రాము, 2 టౌన్ సిఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్.ఐలు సూరప్ప నాయుడు,సంతోష్,శ్రీను మహిళా ఎస్.ఐలు శ్రావణి,విజయ బాయి మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
