Breaking News

మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలి – జిల్లా ఎస్పీ.

నేర నియంత్రణలో బాగంగా మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలనీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,అన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న మహిళా పోలీసు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న డ్యూటీలు, వారికి ఎదురయ్యే సమస్యలు, పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వర్తిస్తే ఎదురయ్యే సమస్యలు,కుటుంబ తరుపున సమస్యల పై అడిగి తెలుసుకోనీ SHE leads – NALGONDA believes అనే నినాదం తో నూతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళ సిబ్బంది పోలీస్ స్టేషన్ లలో రిసెప్షన్, రికార్డు వర్క్, CCTNS, టెక్ టీమ్, ఇతర పోలీస్ స్టేషన్ లో విధులతో పాటు బయట డ్యూటీ లు కమ్యూనిటీ పోలిసింగ్ ప్రోగ్రాం, బ్లూ క్లోట్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎంక్వయిరీ, కోర్ట్ డ్యూటీ, సమాన్స్, మెడికల్ డ్యూటీ, వెహికల్ చెకింగ్, క్రైమ్ డ్యూటీ లు, ఎస్కార్ట్ డ్యూటీ, ట్రాఫిక్ డ్యూటీ లు, బందోబస్త్ డ్యూటీ లు మెన్ తో సమానంగా విధులు నిర్వహించాలని సూచించారు. మహిళా సిబ్బంది కి సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షణ ఏర్పాటు చేయాలి అని అధికారులకు సూచించారు. ఈ సమావేశం ASP మౌనిక ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్.బి సీఐ రాము, WPS CI కరుణాకర్, RI సంతోష్,సబ్ ఇన్స్పెక్టర్ లు, మహిళ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *