
జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, చూచనల మేరకు ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ జయంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త,తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేశాడని అన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి చేసిన కృషి సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ రవి,ఏ.ఆర్.ఎస్.ఐ చిన్న బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.