Breaking News

కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు-ఆడిషనల్ ఎస్పీ రమేష్.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్లు బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గం అని సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైబర్ జాగారుకత దివాస్ సందర్భంగా నల్లగొండ పట్టణం పోలీసు ఆడిటోరియం లో ప్రగతి కళాశాల విద్యార్థుల కు, సైబర్ అవేర్నెస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డబ్బుల పోయాక బాధపడటం కంటే అవగాహనా తో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చదువుకున్న విద్యార్దులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటే తన చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రజలకు,వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తద్వారా సైబర్ మోసాలు నిరోధించవచ్చునని, సైబర్ నేరగాళ్లు ప్రజలనూ మోసం చేస్తున్న విధానాన్ని కళాశాల యువతకు తెలియజేశారు. ప్రస్తుత కాలం లో జరుగుతున్న నేరాలు అయిన పీఎం కిసాన్ యోజన అంటూ APK FILES whatsapp లో ఫార్వర్డ్ చేస్తున్నారు,ఈ apk file ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ కు గురి అయి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది, అలాగే జంప్డ్ డిపాజిట్ స్కీం, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రౌడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన ఆశ, అత్యాశ లే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి అని, డబ్బులు ఎవ్వరు ఉరికే ఇవ్వరు అనే విషయాన్నీ ప్రజలు గ్రహించాలని అన్నారు. అలాగే బ్యాంక్ అదికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరు అనే విషయాలను గుర్తించాలని ,బ్యాంక్ వారు ఏలాంటి మెసేజ్ లు గాని, లింక్స్ పంపరని ఇట్టి విషయాలు యువత కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఏమైన సందేహాలు ఉంటే బ్యాంక్ కు వెళ్లి నిర్ధారించుకోవాలి అని అన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అంటూ ఏదైనా ప్రభుత్వ శాఖ వారు అని ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దు ఆని అలాంటి వారు ఓటీపి అడుగరనే విషయన్ని గ్రహించాలని అన్నారు. ప్రజలు ,గ్రూప్ లలో లేదా వ్యక్తిగత నెంబర్ లకు అపరిచిత వ్యక్తుల నుండి ఎస్ ఎమ్ ఎస్ ఈ మెయిల్స్ ద్వారా గాని, వాట్సాప్ ట్యీట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దు, చిన్న చిన్న తప్పిదాలతో తాము కష్ట పడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే స్పందించి 1930 కి సమాచారం అందించి NCRP portal (www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమo లో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సైబర్ క్రైమ్ ఎస్.ఐ విష్ణు,2 టౌన్ ఎస్.ఐ సైదులు, సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్,కానిస్టేబుల్ మోక్షిడ్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

2025 సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలల (జనవరి నుండి జూన్ వరకు) మెగా రివార్డ్స్ – సీపీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *