బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Hyderabad

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్: ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం నేటి రోజుల్లో అందరికీ అలవాటుగా మారింది. అయితే, ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్‌లో టాప్‌లో కనిపించే వెబ్‌సైట్లు లేదా ‘Sponsored/Ad’ అని చూపించే లింకులు అన్నీ సురక్షితమైనవే అని భావిస్తే భారీ నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంది.

సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించింది కదా అని అది అసలైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మడం వల్ల వినియోగదారులు సులభంగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు.


నకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అత్యాధునిక SEO (Search Engine Optimization) పద్ధతులు, అలాగే Paid Ads ను వినియోగించి నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకులు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చం అసలైన వెబ్‌సైట్లను పోలి ఉండేలా ఫిషింగ్ వెబ్‌సైట్లను సృష్టించి, వాటిని సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో చూపేలా ప్లాన్ చేస్తున్నారు.

వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్లు, బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ యాప్స్, లాగిన్ లింకుల కోసం వెతికినప్పుడు ఈ నకిలీ లింకులు టాప్‌లో కనిపిస్తాయి. అవి నిజమైనవేనని భావించి క్లిక్ చేయగానే మోసం మొదలవుతుంది.


వివరాలు ఇచ్చారో.. ఖాతా ఖాళీ అవుతుంది!

ఈ నకిలీ వెబ్‌సైట్లలోకి వెళ్లిన వెంటనే వ్యక్తిగత వివరాలు, లాగిన్ పాస్‌వర్డ్‌లు, OTP, UPI పిన్ లేదా బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయమని అడుగుతారు. ఒక్కసారి ఆ వివరాలు ఇచ్చిన వెంటనే క్షణాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, మీ పేరిట ఉన్న డాక్యుమెంట్లను దొంగిలించి Identity Theft కు పాల్పడే అవకాశం కూడా ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మోసాల నుంచి రక్షణ మార్గాలు ఇవే

సైబర్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు వినియోగదారులు ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • URL చెక్ చేయండి: వెబ్‌సైట్ అడ్రస్‌ను పూర్తిగా పరిశీలించండి. చిన్న స్పెల్లింగ్ తేడా ఉన్నా అది నకిలీ వెబ్‌సైట్ కావొచ్చు.
  • నేరుగా టైప్ చేయండి: అధికారిక వెబ్‌సైట్ చిరునామా తెలిసి ఉంటే సెర్చ్ చేయకుండా అడ్రస్ బార్‌లో నేరుగా టైప్ చేయడం సురక్షితం.
  • Sponsored/Ad లింకులపై అప్రమత్తత: సెర్చ్ రిజల్ట్స్‌లో ‘Sponsored’ లేదా ‘Ad’ అని కనిపించే లింకులను క్లిక్ చేసే ముందు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి.
  • మోసం అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు: సైబర్ మోసం జరిగిందని అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలి లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

గుర్తుంచుకోండి.. అప్రమత్తతే రక్షణ

ఆన్‌లైన్ ప్రపంచంలో చిన్న నిర్లక్ష్యం కూడా భారీ నష్టానికి దారి తీస్తుంది. కాబట్టి సెర్చ్ ఇంజిన్‌లో కనిపించిన ప్రతీ లింక్ నిజమైనదే అని నమ్మకుండా, పూర్తిగా పరిశీలించి మాత్రమే క్లిక్ చేయడం అత్యంత అవసరం.