బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Hyderabad

వనస్థలిపురంలో దారుణ హత్య.. విడాకుల కోపంతో మాజీ భర్త చేతిలో మహిళ మృతి

వనస్థలిపురంలో దారుణ హత్య.. విడాకుల కోపంతో మాజీ భర్త చేతిలో మహిళ మృతి

హైదరాబాద్, వనస్థలిపురం: వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ మహిళను ఆమె మాజీ భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సునీత అనే మహిళ ఇంట్లోకి ఆమె మొదటి భర్త మహేష్ చొరబడి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ రెండు కత్తులు మరియు పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి వచ్చి సునీతపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం.

ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని మహేష్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

ప్రాథమిక విచారణలో మహేష్, “సునీతతో గతంలో వివాహం జరిగింది. ఆమె నాపై కేసులు పెట్టి విదేశాలకు వెళ్లకుండా చేసింది. అందుకే కోపంతో ఆమెను హత్య చేశాను” అని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

విడాకుల అనంతరం సునీత శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుని ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.