Breaking News

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 58 మందికి జరిమానాలు-సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 58 మంది మందు బాబులు పట్టుబడగా వారిని సిరిసిల్ల పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 58 మంది మందు బాబులకు జరిమానాలు విధిస్తు సిరిసిల్ల మేజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లోపట్టుబడిన మందు బాబులకు పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ దిలీప్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేపించారు. ప్రతి రోజు పట్టణ ప్పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారికి వారి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరైఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతయని,ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రౌడీ సీటర్ అప్పు వివాదం హత్యకేసులో నిందితుల అరెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *