
గత కొన్ని రోజుల క్రితం కనగల్ మండల పరిధిలో మోటర్ వాహనాల దొంగతనాలు మరియు ట్రాక్టర్, ఆటో లలో బ్యాటరీలు దొంగతలకు పాల్పడుతున్నారనీ పిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ఆదేశాల మేరకు కనగల్ ఎస్.ఐ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీ లు నిర్వహిస్తుండగా నల్లగొండ నుండి దేవరకొండ వెళ్తున్న ఆటో మరియు మోటర్ సైకిల్స్ తనిఖీ చేయగా ఆటోలో 20 బ్యాటరీలు మరియు మోటర్ సైకిల్స్ దొంగలించినదిగా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొనీ విచారించగా, A-1: సముద్రాల కృష్ణ S/o రాములు, A-2: షైక్ టిప్పు సుల్తాన్ @ సుల్తాన్ తండ్రి జిలానీ బాష, తేదీ 27-07-2025 రోజున కనగల్ మండల పరిధిలోని కె.బి తండా గ్రామానికి చెందిన కోమటిరెడ్డి కరుణాకర్ రెడ్డి రోడ్డు ప్రక్కన గల వ్యవసాయ క్షేత్రం వద్ద తన మోటర్ సైకిల్స్ ను పార్క్ చేసి, వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చే వరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన వాహనము తీసుకెళ్లారని కనగల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు నిర్వహిస్తుండగా. సుమారు ఉదయం 08.00 గంటల సమయంలో కనగల్ పోలీసులు నల్గొండ – దేవరకొండ రహదారిపై కనగల్ X రోడ్ వద్ద వాహానాలు తనిఖిలు నిర్వహిస్తుండగా నల్గొండ వైపూ నుండి దేవరకొండ వైపు కి వెళ్ళు చున్న బజాజ్ ఆటో (AP-24-W-5505), Passion Pro మోటార్ సైకిల్ నెంబర్ : TS 05 FC 9015 గల వాటిని నడుపుతున్న వారు అనుమానస్పధముగా వెనుకకు తిప్పుకొని వెళ్ళు చుండగా వారిని కనగల్ పోలీస్ వారు పట్టుబడి చేసి తనిఖీ చేయగా వారి వద్ద నుండి మోటార్ సైకల్ మరియు ట్రాక్టర్ & ఆటొ బ్యాటరీ లు 20 దేవరకొండ కు తరలిస్తుండగా ఆ రెండు వాహనాము లో నడుపుతున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా, దేవరకొండ రోడ్ లో రేన్సీబార్ కు వెనుక బాగం లో ఉన్న ఆటో గ్యారేజ్ వద్దకు వెళ్ళి రాత్రి సమయమున ఎవరు లేనిది చూసి అట్టి గ్యారేజ్ లో ఉన్న 5 ఆటో బ్యాటరీలను ఒక మోటార్ సైకల్ మరియు ట్రాక్టర్ & ఆటొ వాహనాల యొక్క 28 బ్యాటరీలను దొంగలించినాము అని ఒప్పుకోగా వీరిని నేడు పట్టుబడి చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. వీరి వద్దనుండి 20 బ్యాటరీల (సుమారు 1,45,000/- రూపాయల విలువ), 8 బ్యాటరీల 24000 రూపాయల నగదు, Passion Pro మోటార్ సైకిల్ ( 40,000/- రూపాయల విలువ), దొంగతనానికి ఉపయోగించే ఒక బజాజ్ RE ఆటో , 1-మొబైల్ ఫోన్ స్వాధీనం. ఈ కేసును ఛేదించిన సబ్ ఇన్స్పెక్టర్ కె రాజీవ్ రెడ్డి , యస్.ఐ కనగల్ పోలీస్ స్టేషన్, M రవీందర్ రెడ్డి పి. సి , పి వెంకన్న పి. సి,పి శేఖర్ పి.సి, బి సురేశ్ పి. సి,సి.హెచ్ రమేశ్ పి.సి, T వెంకట్ రెడ్డి లను చండుర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఆది రెడ్డి అభినందించారు.