
నకిలీ తాళం చెవిలు ఉపయోగిస్తూ మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలనీ అరెస్ట్ చేసిన నార్కట్ పల్లి పోలీస్. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టీ నిందితులను అదుపులోకి తీసుకున్న నార్కెట్ పల్లి పోలీస్ లు 07 కేసుల్లో సుమారు 1600000/- విలువ గల 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం. నిందితులు మట్టిపల్లి శ్రీకాంత్, మట్టిపల్లి. వెంకన్న, మట్టిపల్లి అనిల్. Cr.No.258/2025 U/s 303(2) BNS, నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో కేసును చేదించిన నార్కెట్ పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ & సిబ్బందిని అభినందించి రివార్డు ఇచ్చిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.