Breaking News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు

సంగారెడ్డి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.

తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే రాష్ట్రం: ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల పోరాటాలు, ఆత్మత్యాగాల ఫలితంగా సాధించుకున్న గొప్ప రాష్ట్రంగా నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి ప్రతి పౌరుడి బాధ్యత అని, మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కొత్త జిల్లాలతో అభివృద్ధికి ఊతం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పోలీసు అధికారి, యువకుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం

జిల్లా పోలీసు శాఖ తరఫున ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు, పోక్సో కేసులు వంటి అంశాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ భద్రతపై చైతన్యం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐలు సురేష్, డానియెల్, శ్రీనివాస్ రావు, డీపీవో సూపరింటెండెంట్ మోహనప్ప, అశోక్ తదితర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *