బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Hyderabad

తొమ్మిదేళ్ల బాలికను రక్షించిన సాహసవంతులకు సీపీ వి.సి. సజ్జనర్ సన్మానం – ప్రజా పోలీస్‌లుగా మారాలని పిలుపు

తొమ్మిదేళ్ల బాలికను రక్షించిన సాహసవంతులకు సీపీ వి.సి. సజ్జనర్ సన్మానం – ప్రజా పోలీస్‌లుగా మారాలని పిలుపు

తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని ధైర్యంగా అడ్డుకుని పోలీసులకు అప్పగించిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించా

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సెజల్, గణపతి, కాశీనాథ్‌లను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులను అందజేశారు.

ఈ నెల 14న సెజల్ తన స్నేహితుడు గణపతితో కలిసి యూసుఫ్‌గూడ నుంచి మాదాపూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్ నం.10 సమీపంలో ఒక వ్యక్తి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడం గమనించారు. బాలిక కళ్లలో భయాన్ని గుర్తించిన వారు వెంటనే స్పందించి, అటుగా వెళ్తున్న కాశీనాథ్, శ్రీ నారాయణల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాలికను సురక్షితంగా రక్షించి, వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు యూసఫ్‌గూడకు చెందిన జావీద్‌గా గుర్తించారు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో, ఐస్‌క్రీమ్ కొనిస్తానని మభ్యపెట్టి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై POCSO Act కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఈ యువత సాహసం సమాజానికి ఆదర్శమని తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణలో పౌరుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ “ప్రజా పోలీస్”గా మారాలని పిలుపునిచ్చారు.

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

నేరాల నియంత్రణలో పోలీసుల కృషికి పౌర చైతన్యం తోడైతే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోల్కొండలో మహమ్మద్ ఫిరోజ్ ఎనిమిదేళ్ల బాలికను రక్షించిన ఘటనను కూడా గుర్తు చేశారు.

అనుమానాస్పద ఘటనలు గమనించినప్పుడు భయపడకుండా డయల్ 100కు కాల్ చేయాలని లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేష్, జూబ్లీహిల్స్ ఎస్సై సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.