బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Hyderabad

రూ.2,100 వివాదం.. యువకుడిపై కత్తులతో హత్యాయత్నం.. 48 గంటల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

రూ.2,100 వివాదం.. యువకుడిపై కత్తులతో హత్యాయత్నం.. 48 గంటల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, జూలై 9: కేవలం రూ.2,100 బకాయి డబ్బుల వివాదం ఓ యువకుడిపై హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటనలో 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కత్తులు, రెండు మొబైల్ ఫోన్లు, ఘటన సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని సులేమాన్ నగర్‌కు చెందిన సయ్యద్ పాషు, సయ్యద్ అఫ్తాబ్ అలియాస్ అఫ్ఫు (24) గత ఐదేళ్లుగా స్నేహితులు. ఈ ఏడాది మేలో ఇద్దరూ ముంబైకి వెళ్లి సరుకు రవాణా వాహనాల డ్రైవర్లుగా పనిచేశారు. అక్కడ యజమాని షేక్ మొబిన్ సయ్యద్ పాషుకు రూ.2,100 జీతం బకాయి ఉంచడంతో, ఆ డబ్బు ఇప్పించాలని అఫ్తాబ్‌ను పాషు పదేపదే నిలదీసేవాడు.

ఈ క్రమంలో జూలై 6 రాత్రి ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన అఫ్తాబ్ తన పరిచయస్తుడు అక్బర్ ఖాన్ (28)ను ఇంటికి పిలిపించి పాషును హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

జూలై 7 తెల్లవారుజామున పాషు తన స్నేహితులతో కలిసి అఫ్తాబ్ ఇంటి వద్దకు వెళ్లి డబ్బుల విషయంలో గొడవకు దిగాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్బర్ ఖాన్ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, పాషు స్నేహితులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పాషు కూడా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీశాడు. వెంటనే అఫ్తాబ్ ఇంట్లోకి వెళ్లి మరో కత్తి తీసుకొచ్చి పాషు పొత్తికడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పాషు కుప్పకూలగా, ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

ఈ ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 792/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109(1), 111, 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాయి.

దర్యాప్తులో అఫ్తాబ్‌పై గతంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం సహా రెండు కేసులు ఉన్నట్లు, అక్బర్ ఖాన్‌పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు నమోదై కోర్టు విచారణలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఐపీఎస్ పర్యవేక్షణలో అత్తాపూర్ ఎస్‌హెచ్‌వో కె. నాగేశ్వరరావు, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. రవి ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్ట్ చేసింది. వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.