బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

ఆరూర్ గ్రామంలో రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రణాళికలో భాగంగా, 1వ రోజు రోడ్డు భద్రతపై జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో గ్రామ సభలు, గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సదాశివపేట మండలం, ఆరూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను ఘనీయంగా తగ్గించి, ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో “అరైవ్ అలైవ్” రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత కమిటీలు ఆయా గ్రామాలలో గల రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్న సమస్యలను అధకారుల దృష్టికి తీసుకురావడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణానికి జిల్లా పోలీసు శాఖ ఏళ్లవేళల కృషి చేస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరిస్తూ, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ వ్యక్తిపై ఆదార పడిన కుటుంబం రోడ్డున పడుతుందని అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నుండి ఏవిధంగా బయట పాడాలని, ఎలా సురక్షిత ప్రయాణాలు చేయాలని డిఫెన్సివ్ డ్రైవ్ మెలకువలపై అవగాహన కల్పించారు. చిన్నారులు తమ తల్లిదండ్రులు బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా గుర్తు చేయాలని అన్నారు. వాహణదారులు ఎట్టి పరిస్థితులలోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పరిమిత వేగంలో వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డులపై పాదచారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. యువత రోడ్డు ప్రమాదాలపై వెంటనే స్పందించి, సమీప పోలీసు స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిచాలని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్ కు తరిలించేలా చూడాలని అన్నారు. రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించే స్టికర్ లను ఎస్పీ స్వయంగా ఆటోకు అతికించారు. అదే విధంగా అయ్యా గ్రామాలలో జిల్లా పోలీసులు, రోడ్డు భద్రత కమిటీల ఆద్వర్యంలో రోడ్డు మరమత్తు పనులను చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్, సదాశివపేట ఇన్స్పెక్టర్ వెంకటేశ్, ఎంఆర్ఓ హరిప్రసాద్, డాక్టర్ పరశురామ్, మోటార్ హేహికల్ ఎస్ఐ శిరీష, గ్రామ స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్