బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి.

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ లోని యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని,పట్టణ పరిధిలో అర్ధరాత్రి సమయంలో రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనపడిన అత్యవసర సమయంలో డయల్ 112కు సమాచారం అందించాలని, కాలనీల్లో స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు భద్రతను పాటిస్తూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని,ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్