బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

అధిక శబ్దం కలిగించే 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ధ్వంసం-అడిషనల్ ఎస్పి.

నల్లగొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు శబ్ద కాలుష్య, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్, ఐపిఎస్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి, నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పి రమేష్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. సైలెన్సర్లలో అనుమతి లేకుండా మార్పులు చేసి అధిక శబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగించినట్లయితే, అట్టి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసి, వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించే వారిపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ, ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్‌ను కొనసాగిస్తారని తెలిపారు. జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం మరియు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ఎవరైనా అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే, సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవ రావు,ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య,1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్. ఐ సైదులు,రూరల్ ఎస్.ఐ సైదా బాబు, కనగల్ ఎస్. ఐ రాజీవ్ రెడ్డి,మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్