
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అద్దంకి నార్కట్పల్లి హైవే మాడుగుల పల్లి వద్ద గల రోడ్డు పైన ప్రవహించే నీటి ప్రవాహాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,పరిశీలించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడతాయన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు. ముఖ్యంగా రానున్న రెండు రోజులు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మూసి పరివాహక మరియు కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బారి వర్షాల కారణంగా ఎగువ నుంచి అధిక ప్రవాహం కారణంగా వాగులు, వంకలు ఉదృతంగా ప్రహిస్తున్నాయని అలాంటి సమయంలో ఎవరూ కూడా దాటే ప్రయత్నం చేయకూడదని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నీటి ప్రవాహం ఎక్కువగా ప్రవహించే వాగులు,వంకలు,కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు,పోలీస్ పికెట్లు ఏర్పటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పాడుబడిన మిద్దెలు, పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లో, చెట్లకింద ఉండవద్దని సూచించారు. వాగులు వంకలు వద్ద అధిక నీటి ప్రవాహం ఉంటున్ననందు వాటిని దాటే ప్రయత్నం చేయరాదని అన్నారు. వ్యవసాయ పనులు దృష్ట్యా రైతులు పొలాల్లోకి వెళ్లి వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ మోటార్లు వద్దకు వెళ్లి స్వీచ్ ఆన్ చేయవద్దని, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్ల పక్కన వున్న విద్యుత్ స్తంబాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలి. వాహన దారులు అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు గురి కూడదని తెలిపారు. జిల్లా ప్రజలకు 24/7 ఎల్లప్పుడు పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, యస్.బి సీఐ రాము తదితరులున్నారు..
