
“నాశ ముక్త్ భారత్ అభియాన్” 5వ వార్షికోత్సవం సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనకు సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్, మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ధర్మాపూర్ నందు విద్యార్థులు, సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజం మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించాలంటే కుటుంబం, విద్యాసంస్థలు, పోలీస్ శాఖ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది, సురక్ష పోలీసు కళాబృందం, షీ టీం మరియు మానవ అక్రమ రవాణా నిరోధక బృందాల సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇట్టి కార్యక్రమం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ N.B. రత్నం, AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DCRB DSP రమణా రెడ్డి, AR DSP శ్రీనివాసులు, AO రుక్మిణి భాయి, RI లు కృష్ణయ్య, నగేష్, రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, DPO సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
