
బాలానగర్ పిఎస్ లో అమలు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) కోసం ఫిర్యాదుదారులు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండటం మనం చూస్తుంటాం. సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి, ఐపీస్, ఆదేశాల మేరకు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరధిలో సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో ప్రయోగాత్మకంగా వయవృద్ధుల ఫిర్యాదు పై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి పోలీస్ స్టేషన్ నుంచి సీఐ నర్సింహా రాజు, ఎస్ఐ సరితా పటేల్ రెడ్డి, వినోద్ తో కలిసి నేరుగా ఫిర్యాదుదారులు ఇంటికి వెళ్లి వాటిని అందజేశారు. ఆశ్చర్యపోయిన ఫిర్యాదుదారులు, గమనించిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సైబరాబాద్ సిపికి, బాలానగర్ సీఐ నర్సింహా రాజుకు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా చూసేందుకు వయవృద్ధుల, వికలాంగులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఎఫ్ఐఆర్ నమోదుచేసి వారి ఇళ్లకు వెళ్లి అందిస్తే ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం మరింత విశ్వాసం పెంచాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. అంతేకాక సున్నితమైన కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు మఫ్టీలో ఇంటికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ అందజేస్తామని వివరించారు.
