Breaking News

ఢిల్లీ కి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠా ను అరెస్ట్.

వీరి వద్ద నుండి 65 లక్షల విలువ చేసే 250 కిలోల గంజాయి తో పాటు రెండు కార్లు మరియు 06 సెల్ ఫోన్లు స్వాధీనం.( మొత్తం విలువ సుమారు Rs.1, 00,00, 000/- (కోటి రూపాయలు). A-1: మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర పరారి, A-2: బబ్లు అలియాస్ బబ్బ్లు నగర్ పరారి, A-3: నూర్ మొహమ్మద్ అలియాస్ రాజా తండ్రి షహనాజ్ పరారి,A-4: జమీల్ పరారి, A-5: మంగల్ పరారి, A-6: భాను పరారి, A-7: కన్హాయి అధికారి పరారి. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా చిట్యాల SI రవి కుమార్ తన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ మరియు కానిస్టేబుల్ వెంకన్న లతో కలిసి చిట్యాల పట్టణం లో పెట్రోల్లింగ్ విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున సుమారు 05 గంటల సమయం లో విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపు గా వెళ్తున్న ఒక హోండా సిటీ కారు చిట్యాల పట్టణం లో ని సుజన ధియేటర్ సమీపం లో రోడ్డు పక్కన అనుమానస్పదంగా ఆపి ఉంచగా వెంటనే SI తన సిబ్బంది తో కలిసి అట్టి కారు వద్దకు వెళ్లి కారు లో ఉన్నముగ్గురు వ్యక్తులను కిందికి దించి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని వివరాలు అడుగుచుండగా అప్పుడు ముగ్గురు పారిపోవడానికి ప్రయత్నిoచగా అందులో ఒకర్ని పట్టుబడి చేయగా మిగిలిన ఇద్దరు పారిపోయారు. అదే సమయం లో పైలట్ చేస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు రావడం తో అది కూడా వీరిదే అని ఆపుటకు ప్రయత్నించగా పోలీస్ అట్టి కారు సిబ్బందిని మీదకు తోలుచుండగా అట్టి కారు ను వెనుక నుండి పోలీస్ వారు వెనుక నుండి లాటి తో కొట్టగా అట్టి కారు వెనుక అద్దం పగిలిపోయింది. తదుపరి అట్టి పట్టుపడిన వ్యక్తి ని విచారించగా మేము గంజాయి ని తిస్కోని పోతున్నాము అని చెప్పటం జరిగింది. ఇట్టి విషయం ను నార్కెట్ పల్లి CI నాగరాజు కి తెలపగా, సిబ్బంది తో వచ్చి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ను అలెర్ట్ చేయటం జరిగింది. మరొక కారు ను SI కట్టంగూర్ సమాచారం మేరకు తన పోలీస్ స్టేషన్ పరిధి లో గుర్తించటం జరిగింది. ఇట్టి కారు ను నేరస్తుడు కూడా ద్రువికరించటం జరిగింది. దీంతో అనుమానం వచ్చి ఆపి ఉన్న కారు ను తనిఖి చేయగా అందులో ఎక్కువ మొత్తం లో గంజాయి ఉండటం తో, CI మరియు ఎస్సై పట్టుబడి చేసిన మూడో వ్యక్తిని ఇట్టి గంజాయి గురించి మరియు పారిపోయిన వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకోగా, తన పేరు నూర్ మొహమ్మద్ అని ఇక్కడి నుంచి పారిపోయిన వ్యక్తులు బబ్లు అలియాస్ బబ్బ్లు నగర్, జమీల్, మంగల్, భాను మరియు కన్హాయి అధికారి అని తెలిపి మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర తమ ఆరుగురిని ఢిల్లీ లో ఉన్న కాశ్మీర్ గెట్ వద్దకు పిలిచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండి గంజాయి తిస్కోని రావాలి అని అందుకు ఒక్కొక్కరికి 20, 000 రూపాయలు ఇస్తాను అని చెప్పి వారందరికి మూడు కార్లు (స్విఫ్ట్ డిజైర్, మారుతీ సియాజ్ మరియు హోండా సిటీ) ఇవ్వగా, మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర ఆదేశాల మేరకు ఆరుగురు వ్యక్తులు ఇట్టి మూడు కార్లలో ఢిల్లీ నుండి రోడ్డు మార్గం గుండా ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర మీదుగా తెలంగాణా రాష్ట్రము లోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అనకాపల్లి ప్రాంతానికి వెళ్ళగా అక్కడ మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర ముందే చెప్పి ఉంచిన గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన గంజాయి ని అట్టి ఆరుగురు వ్యక్తులు రెండు కార్ల లో నింపుకొని ఒక కారు అట్టి రెండు కార్లకు పైలట్ గా తిరిగి మూడు కార్లు అక్కడి నుంచి రోడ్డు మార్గం లో ఢిల్లీ కి చేరుకొని అక్కడ మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర ఆదేశాల మేరకు మూడు కార్లను ఒక పార్కింగ్ స్థలం లో వదిలేసి ఆరుగురి లో నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోగా తదుపరి మిగిలిన ఇద్దరు బబ్లు అలియాస్ బబ్బ్లు నగర్, జమీల్ కాశ్మీర్ గేటు మరియు అక్షర ధాం వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర ఆదేశాల మేరకు గంజాయి ని అమ్ముతారు. వీరు ఇలా గత కొంత కాలంగా ఇట్టి పనులు చేస్తూ ఎప్పటి లాగే తేది 01.08.2025 రోజున ఢిల్లీ నుంచి మూడు కార్లలో రోడ్డు మార్గం లో ౦5.08.2025 న అనకాపల్లి సమీపం లో ని ఒరిస్సా బోర్డర్ లో సుమారు 500 కేజీల గంజాయి ని కొనుగోలు చేసి హోండా సిటీ కార్ లో 250 కేజీలు మరియు మారుతీ సియాజ్ కారు లో 250 కేజీలు నింపుకొని నిన్నటి రోజు అనగా తేది 06.08.2025 న రాత్రి ప్రారంభమై తెల్లవారుజామున చిట్యాల పట్టణం లోని సుజన ధియేటర్ సమీపం లో చిట్యాల పోలీస్ వారు హోండా సిటీ కారు తో 250 కేజీల గాంజా మరియు పైలట్ చేస్తున్న మారుతీ డిజైర్ కారు పట్టుబడి చేయటం జరిగింది. ఇట్టి విషయమై చిట్యాల పోలీస్ వారు పై వ్యక్తులపై Cr. No. 200/2025 U/s 8 (C) 20(b)(ii)(c), 29 of NDPS Act-1985 Amendment Act 2001 లో కేసు నమోదు చేసి పట్టుబడిన నూర్ మొహమ్మద్ అలియాస్ రాజా తండ్రి షహనాజ్ ను రిమాండ్ చేయడమైనది. అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, మరియు ఎవరైనా వినియోగించినా/వాడినా ఉపేక్షించేది లేదు జిల్లా యస్పి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే/వినియోగించే వ్యక్తుల పైన కూడా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా S.P హెచ్చరించనైనది. ఇట్టి కేసును చేదించిన నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి C.I, K. నాగరాజు ఆద్వర్యంలో చిట్యాల S.I, M. రవి కుమార్ మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ మరియు మొహసిన్ పాషా, కానిస్టేబుల్ వెంకన్న, రాజేష్, మహేష్ లను జిల్లా S.P అభినందించనైనది.

2025 సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలల (జనవరి నుండి జూన్ వరకు) మెగా రివార్డ్స్ – సీపీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *