
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి అధికారులు,పోలీస్ సిబ్బందితో కలసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు రమేష్,యాదగిరి,కార్యాలయ సూపరింటెండెంట్ లు,జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
