
ప్రభుత్వం సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సిరిసిల్లలో ఉన్న మ్యూచవల్లి ఆడెడ్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న కార్మికులతో మాత్రమే బట్టలను తయారు చేయించి దాన్ని ప్రభుత్వం నిబంధనలో ప్రకారం కొనుగోలు చేయాలి దానిలో భాగంగా సిరిసిల్లలో ఉన్న జాగృతి మ్యాక్ సొసైటీ ముఖ్య సభ్యులు ఆగు కొండబత్తిని మల్లేశం (అధ్యక్షులు) బొల్లబత్తి లక్ష్మీనారాయణ (ఉపాధ్యక్షులు) కట్ల శ్రీనివాస్( కార్యదర్శి) చింతకింది సత్యం( డైరెక్టర్ ) మరియు బొడ్డు గోపాల్( డైరెక్టర్లు ) జెబి నగర్ సిరిసిల్ల అనువారు ప్రభుత్వం మరియు నేత కార్మికులను మోసం చేసి అధిక లాభాలు పొందాలని ఉద్దేశంతో వారు నేత కార్మికులలో బట్టలను నియమించకుండా బయట నుండి బట్టలను కొనుగోలు చేసి ప్రభుత్వంకు అమ్ముచున్నారు. దీనిలో భాగంగా వారు బట్టలను వ్యవసాయం మార్కెట్ కమిటీ ఇందిరానగర్ సిరిసిల్ల గోదాంకు తీసుకురాగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సాంకేతిక అధికారులు పక్కకు పెట్టిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెక్స్టైల్ పవర్ డిపార్ట్మెంట్లో ఏ.డి. పని చేస్తున్నా అశోక్ రావు తనిఖీ చేసి తేదీ 29.05.2017 రోజున సుమారుగా 13 లక్షల సరుకును సీజ్ చేసి జాగృతి మ్యాక్స్ సొసైటీ సభ్యులు కొండబత్తిని మల్లేశం బొల్లాబత్తిని లక్ష్మీనారాయణ, కట్ల శ్రీనివాస్ ,చింతకింది సత్యం మరియు బొడ్డు గోపాలు అధిక లాభాలు పొందాలని ఉద్దేశంతో ప్రభుత్వం మరియు నేత కార్మికులను మోసం చేయగా వీరిపై అశోక్ రావు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ మాచినేని రవి కేసు నమోదు చేసి విచారణ అనంతరం విచారణ అధికారి అయిన శేఖర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినాడు. CMS ఆర్ ఎస్ ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ పదిమంది (10)సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టినారు ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చలుమూల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ నేరస్తులు ఆయన కొండబత్తిని మల్లేశం, బల్లబత్తిని లక్ష్మీనారాయణ,కట్ల శ్రీనివాస్,చింతకింది సత్యం, బొడ్డు గోపాల్ లకు మూడు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి 5000 రూపాయల జరిమానా మొత్తం (25000) విధించడం జరిగింది అని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపినారు.