
వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ సింగ్ తండా శివారులో అక్రమ ఎర్ర రాయి తవ్వకాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేసి అక్రమంగా తవ్విన ఎర్ర రాయిని కర్ణాటక రాష్ట్రానికి తరలించడానికి సిద్ధంగా ఉన్న ఐదు ట్రాక్టర్లు, తవ్వకాలకు ఉపయోగిస్తున్న రెండు జేసీబీలను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని సీజ్ చేసి, వారిపై పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక, రాతి, మట్టి, ఇతర ఖనిజాలను అక్రమంగా తవ్వడం, తరలించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. అటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.