Breaking News

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అని, బాల కార్మికులకు విముక్తి కల్పించడానికి, ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ పేర్లతో రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులకు విముక్తి కల్పించి, పాఠశాలలకు పంపించడం జరుగుతుందని అన్నారు. గల నెల రోజులుగా అనగా జూలై 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-XI లో భాగంగా వివిధ శాఖలు పోలీసు శాఖ, చైల్డ్ లేబర్, సి.డబ్ల్యూ.సి, డి.సి.పి.యు. విద్యాశాఖ మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ మొదలైన శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి, ఆపరేషన్ ముస్కాన్-XI ను విజయవంతం చేయడం జరిగిందని, ఆపరేషన్ ముస్కాన్-XI టీం ను జిల్లా ఎస్పీ అభినందించారు. ఆపరేషన్ ముస్కాన్-XI లో భాగంగా ఈ సంవత్సరం మొత్తం 126 మంది బాల కార్మికులను రక్షించడం జరిగింది. వీరిలో 119-మంది బాలురు, 07-మంది బాలికలు ఉన్నారని, బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న యజమానులపై 81 కేసులు నమోదు చేయడం జరిగిందని, అట్టి వ్యక్తులపై చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకున్నా, వెట్టిచాకిరికి గురి చేసినా, బలవంతంగా బిక్షాటన చేయించినా, పశువుల కాపరులుగా, కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్ లు ఇతర ప్రదేశాలలోనూ పని చేయించడం, చట్టరీత్యా నేరం, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టరిత్య క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బాల కార్మికులు ఎవరైన కనిపించినట్లయితే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా డైల్ 100 కు గాని సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.

ముద్రా రుణ మోసంలో పాల్గొన్న నిందితుడు అరెస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *