Breaking News

జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నివారణే లక్ష్యంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయంత్రం నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుదన్నారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే అట్టి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని,జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి శుక్రవారం రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారస్సు చేయడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు,ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులకు బాధ్యత వహంచాలనీ హెచ్చరించారు. వాహనదారులు,రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. తాగి వాహనాలు నడపవద్దని తద్వారా జరిగే ప్రమాదాలను కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలపై పోలీస్ శాఖ వారు కౌన్సిలింగ్‌ ద్వారా వివరించడం జరుగుతుంది. పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది. మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన రెండవసారి పట్టుబడిన వారు సేవించిన మద్యం మోతాదులను బట్టి తప్పనిసరిగా శిక్షలు విధించబడతాయి. ట్రాఫిక్‌ నియంత్రణపైన,మద్యం తాగి వాహనాలు నడిపేవారిపైన కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి నిరంతరం కౌన్సిలింగ్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ముద్రా రుణ మోసంలో పాల్గొన్న నిందితుడు అరెస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *