
రుద్రంగి పరిధిలోని మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన ఎస్.ఐ శ్రీనివాస్. యూరియా అక్రమంగా దాచిపెట్టిన రవాణా చేసిన , బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు సూచించిన దాని ప్రకారం రైతులు యూరియా వాడుకోవాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా యూరియా దాచిపెట్టిన వ్యవసాయేతర పనులకు యూరియా వాడిన ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని సూచించారు. ఎస్.ఐ వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
