బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

మొహర్రం-బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది.

మొహర్రం సంతాప దినాలలో భాగంగా, 10వ మొహర్రం సందర్భంగా జరిగిన బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది. సి.వి. ఆనంద్ ఐపిఎస్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, స్వయంగా చారిత్రక చార్మినార్ వద్ద ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా అధికారులందరికీ ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించారు. గత 10 రోజుల నుండి మొహర్రం సంతాప దినాలకు సి.వి. ఆనంద్ అధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టారు. బీబీ కా ఆలం యొక్క ఈ భారీ ఊరేగింపు దబీర్‌పురా(దారుల్ షిఫా) లోని ఆషుర్‌ఖానా నుండి ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన లక్ష్మి ఏనుగుపై “ఆలం”ను ఉంచి ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఈ ఊరేగింపు మూసీ నది ఒడ్డున ఉన్న మసీద్-ఎ-ఇలాహీ, చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది. నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులతో కలిసి ఊరేగింపును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున చార్మినార్ వద్ద ఆలంకు పూలమాలలు మరియు దట్టీలు సమర్పించారు. ఈ బిబీకా ఆలం ఊరేగింపుకు 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని చర్యలు చేపట్టడం వలన హైదరాబాద్‌లో బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ ఐపిఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్‌లోని షియా కమ్యూనిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ ఐపిఎస్ (అదనపు కమిషనర్ ఆఫ్ పోలీసు L&O),డి. జోయెల్ డేవిస్ ఐపిఎస్ (జాయింట్ సిపి ట్రాఫిక్), రక్షిత కృష్ణ మూర్తి ఐపిఎస్ (డిసిపి CAR హెడ్‌క్వార్టర్స్), స్నేహా మెహ్రా ఐపిఎస్ (డిసిపి సౌత్ జోన్) తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్