బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

అన్న ఇంటిని తగలబెట్టిన తమ్ముడికి ఐదేళ్ల జైలు శిక్ష.

తమ్ముడి చేతిలో తగలబడిన అన్న ఇంటి కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లక్ష్మణ చారి తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బాల నరసయ్య తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి తన తమ్ముడు మల్లయ్యతో భూవివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మల్లయ్య, 2019 జూన్ 12న రాత్రి 11 గంటల సమయంలో నరసయ్య ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనపై నరసయ్య తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ శేఖర్ కేసు నమోదు చేసి మల్లయ్యను రిమాండ్‌కు తరలించారు. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీ ప్రసాద్ వాదించగా కోర్టు మానిటరింగ్ ఎస్సై నాయుడు నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్,కానిస్టేబుల్లు నవీన్, రాజేందర్ లు ఎనిమిది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్